క‌రోనా భ‌యంతో ఎవ‌రూ ముందుకురాక‌పోడంతో..

Due ToThe Fear Of Corona Funeral Was Conducted  With Help of JCB  - Sakshi

సాక్షి, నిజామాబాద్ : బంధాల‌ను, మాన‌వ‌త్వాన్ని దూరం చేసేస్తుంది ఈ క‌రోనా మ‌హ‌మ్మారి. మ‌నిషి చ‌నిపోతే పాడె మోయ‌డానికి ఉండాల్సిన న‌లుగురు వ్య‌క్తులు కూడా లేక అనాథ శ‌వాల్లా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది ఈ క‌రోనా. తాజాగా నిజామాబాద్ ఆర్మూరు మండలం గోవింద్‌పేట్‌నూ ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. క‌రోనా అనుమానుంతో బంధువులు ముందుకు రాక‌పోవ‌డంతో జేసీబీ స‌హాయంతో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. వివ‌రాల ప్ర‌కారం నాలుగు రోజుల క్రిత‌మే ఆ కుటుంబంలోని వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగిటివ్ అని తేలింది. అయితే పెరాల‌సిస్‌తో బాధ‌ప‌డుతున్న త‌ల్లిని ఈరోజు హాస్పిట‌ల్‌కి తీసుకెళ‌దామ‌నుకునే లోపే ఆమె నిద్ర‌లోనే కన్నుమూసింది. దీంతో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డానికి బంధువులు ఎవ‌రూ రాక‌పోవ‌డంతో కొంత‌మంది  గ్రామ‌స్థుల స‌హ‌కారంతో పీపీఈ కిట్ ధ‌రించి త‌ల్లి శ‌వాన్ని జేసీబీ ద్వారా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. (చ‌ద‌వండి: ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్‌ కేసు విషాదాంతం!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top