
హైదరాబాద్: అనైతిక సరోగసి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో భాగంగా డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. సరోగసీ పేరుతో పలువురిని మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారు.
చేసిన తప్పులను ఒప్పుకున్న డాక్టర్ నమ్రత.. దంపతులను సరోగసీ విషయంలో మోసం చేసినట్లు ఒప‍్పుకున్నారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసీ వైపు మళ్లించినట్లు తెలిపిన నమ్రత.. ఆ రాజస్థాన్ దంపతులు డీఎన్‌ఏ రిపోర్ట్ అడిగితే.. కుమారుడి ద్వారా రాజస్థాన్ దంపతులను బెదిరించినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, అనస్థీషియన్ సదానందం డాక్టర్ నమ్రతకు సహకరించారని పోలీసులు తెలిపారు. సరోగసీ ద్వారా నమ్రత చాలా మోసం చేశారని పోలీసులు వెల్లడించారు.