Hyderabad: బ్లడ్ బ్యాంకుల అనుమతులు రద్దు.. | Sakshi
Sakshi News home page

Hyderabad: బ్లడ్ బ్యాంకుల అనుమతులు రద్దు..

Published Tue, Feb 20 2024 10:17 AM

DCA Telangana cancels licence of two blood banks in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్:  ఎండలు ముదురుతున్నాయి. విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రాకపోవడంతో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం లేదు. ఫలితంగా నగరంలోని పలు రక్తనిధి కేంద్రాల్లో రక్తపు నిల్వలు నిండుకున్నాయి. దీనిని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు అవకాశంగా తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచి్చన రోగులకు హోల్‌ బ్లడ్‌ సహా ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్లడ్‌ బ్యాంకుల పేరుతో భారీగా దండుకుంటున్నారు. ఈ రక్తపిశాచులపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మిని్రస్టేషన్‌ అధికారులు అప్రమత్తమై..అనుమానం ఉన్న బ్లడ్‌ బ్యాంకులపై దాడులు నిర్వహించారు. స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న పలు బ్లడ్‌ బ్యాంకులను గుర్తించి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
 
ఫక్తు వ్యాపారం

ప్రస్తుతం గ్రేటర్‌లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్‌ బాం్యకుల నిర్వాహకులు ప్రముఖుల బర్త్‌డేల పేరుతో ఇంజినీరింగ్‌ కాలేజీలు, కార్పొరేట్‌ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తుంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్‌ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగుల కు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని పలు బ్లడ్‌ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్‌ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉంది. దీనిని నగరంలోని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. 

కృత్రిమ కొరత సృష్టించి 
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు అధిక రక్త్రస్తావంతో బాధపడుతుంటారు. గర్భిణుల ప్రసవాలతో పాటు పలు కీలక సర్జరీల్లోనూ రక్త్రస్తావం అధికంగా ఉంటుంది. ఇలాంటి వారికి తక్షణమే ఆయా గ్రూపుల రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. డెంగీ జ్వరంతో బాధపడే వారికి తెల్లరక్తకణాలు ఎక్కించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగుల బంధువులు నమూనాలు తీసుకుని సమీపంలోని రక్తనిధి కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. రోగుల బంధువుల్లో ఉన్న బలహీనతను అక్రమార్కులు అవకాశంగా తీసుకుంటున్నారు. హోల్‌ బ్లడ్‌ సహా ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను ఆయా బ్లడ్‌ బ్యాంకుల సామర్థ్యానికి మించి నిల్వ చేసి, మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. రక్తపు కొరత పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 

డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు
సాధారణ తనిఖీల్లో భాగంగా డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని హీమో సరీ్వసెస్‌ లాబోరేటరీలో తనిఖీలు నిర్వహించారు. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు ఆర్‌ రాఘవేంద్రనాయక్‌ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకర, న్యూలైఫ్‌ బ్లడ్‌ బ్యాంకుల నుంచి హోల్‌ బ్లడ్‌ను సేకరించి, ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంకు సహా, దారుషిఫాలోని న్యూలైఫ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంకు కూడా ఉంది. ఈ రెండు బ్లడ్‌ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement
 
Advertisement