రూ.50 కొట్టండి.. నాటుకోడి, ఫుల్‌బాటిల్‌ గెలుచుకోండి | Karimnagar Villages’ Dasara Lucky Draw Offers Live Hen & Liquor Bottles as Prizes | Sakshi
Sakshi News home page

రూ.50 కొట్టండి.. నాటుకోడి, ఫుల్‌బాటిల్‌ గెలుచుకోండి

Sep 23 2025 1:38 PM | Updated on Sep 23 2025 2:12 PM

Dasara Lucky Draw in Telangana

రూ.50 కొట్టండి.. నాటుకోడి, ఫుల్‌బాటిల్‌ గెలుచుకోండి

వాట్సాప్, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం

కరీంనగర్‌రూరల్‌: దసరా జోష్‌ను క్యాష్‌ చేసుకునేందుకు గ్రామాల్లో పలువురు పలు రకాలుగా ఆలోచిస్తున్నారు. రూ.50 చెల్లించి ఒక కూపన్‌ కొంటే చాలు.. నాటుకోడి, టీచర్స్‌ మద్యం బాటిల్‌ గెలుచుకోవచ్చంటూ ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా చెర్లభూత్కూర్‌లో రూ.50 చెల్లించి కూపన్‌ తీసుకోండి దసరా ధమాకా గెలుచుకోండి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 

మొదటి బహుమతిగా నాటుకోడి, టీచర్స్‌ ఫుల్‌బాటిల్, రెండో బహుమతిగా బ్లెండర్‌సై్పడ్‌ రిజర్వ్‌ ఫుల్‌బాటిల్, మూడో బహుమతిగా రాయల్‌స్టాగ్‌ ఫుల్‌బాటిల్‌ గెలుచుకోండంటూ వాట్సాప్, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. చెర్లభూత్కూర్‌తోపాటు సమీప గ్రామాలు  దుబ్బపల్లి, చామనపల్లి, తాహెర్‌కొండాపూర్, మొగ్ధుంపూర్‌కు చెందిన వ్యక్తులు కూపన్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement