
నడిగడ్డ తండాలో CRPF క్యాంపు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. మియాపూర్ నడిగడ్డ తండా సమీపంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపులో కానిస్టేబుల్ బుధవారం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చనిపోయిన కానిస్టేబుల్ గుజరాత్‌కు చెందిన సిఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గ ఠాగూర్ శంకర్‌గా గుర్తించిన పోలీసులు.. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.