కరోనా.. అప్రమత్తతే అసలు మందు 

Corona Vigilance Is The Real Drug - Sakshi

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ముందు జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్య నిపుణులు 

వైరస్‌ సోకినా సులభంగా బయటపడొచ్చునని సూచన 

సాక్షి, హైదరాబాద్‌:  కోవిడ్‌ వైద్యపరంగా అనేక సవాళ్లు విసురుతున్నప్పటికీ.. దీర్ఘకాలిక వ్యాధిగ్ర స్తులు సైతం కొన్ని ప్రత్యేక చర్యలు, ముందు జాగ్రత్తలతో కరోనా ముప్పు నుంచి తప్పించుకోవచ్చు నని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. కరోనా సోకకుండా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యం పట్ల అప్రమత్తతతో వ్యవ హరిస్తూ, రోజువారీ పర్యవేక్షణ అమలు చేయాలని సూచిస్తున్నారు. రోజువారీ మందులు క్రమం తప్పకుండా వాడటంతో పాటు, ఇతర సప్లిమెంట్లు, ప్రొటీన్‌ తీసుకోవడం ద్వారా కరోనా సోకినా సుల భంగా బయటపడొచ్చునని చెబుతున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమైన తర్వాత మధుమేహం, రక్తపోటుతో పాటు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమ స్యలు ఉన్న వారు (కోమార్బిడిటీస్‌) ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం స్పష్టమైంది. బీపీ ఉన్నవారికి కోవిడ్‌ సోకితే ఇన్ఫెక్షన్‌ తీవ్రత పెరుగుతుందని, షుగర్, బీపీ రెండూ ఉంటే వైరస్‌ ప్రభా వం మరింత ఎక్కువగా ఉంటుందని కూడా తెలిసింది. బీపీ లేదా చక్కెర వ్యాధి ఉన్నవారిలో కార్డియో, సెరెబ్రోవాస్క్యులర్‌ జబ్బులు వచ్చే అవకాశాలున్నట్టుగా వైద్యులు తేల్చారు. ఈ నేపథ్యంలో బీపీ, షుగర్‌ ఉన్నవారు కోవిడ్‌ బారిన పడితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఏయే అంశాలు ప్రభా వితం చేస్తాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై డాక్టర్‌ ప్రభుకుమార్, డాక్టర్‌ నవీన్‌రెడ్డి తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. 

అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి
బీపీ, షుగర్‌ ఉన్న వాళ్లు కష్టమైనా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సిం దే. దగ్గు, జలుబు వంటి చిన్న లక్షణాలు కనిపించినా డాక్టర్లను సంప్రదించాలి. వైద్యులతో టచ్‌ లో ఉండాలి. షుగర్, బీపీ స్థాయిలను రోజూ చెక్‌ చేసుకోవాలి. రోజూ వాడే మందుల నిల్వలు సరిపడా ఉండేలా చూసుకోవాలి. స్టెరాయిడ్స్‌ వినియోగం, మానసిక ఒత్తిళ్లతో పేషెంట్లలో కొత్తగా మధు మేహం రిపోర్ట్‌ అవుతోంది. వీరికి ముందుగానే రక్తం పలుచన చేసే మందులు, మల్టీ విటమిన్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటర్స్, స్టెరాయిడ్స్‌ ఇస్తారు. సెకండ్‌వేవ్‌లో డయాబెటీస్, రక్తపోటు ఉన్న వారిలో వైరస్‌ రియాక్షన్, లోడ్‌ పెరిగి వైరస్‌తో కూడిన ఫెరిటిన్‌ శరీరమంతా వ్యాపించి నష్టం చేస్తోంది.  
– డాక్టర్‌ ప్రభుకుమార్‌ చల్లగాలి, కన్సల్టెంట్‌ ఫిజిషియన్, డయాబెటీస్‌ నిపుణుడు, వృందశ్రీ క్లినిక్‌

తీవ్రత కొంత పెరిగింది... 
సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ జన్యు రూ పాంతరం, పరివర్తనం, మ్యుటేషన్లు చెందడంతో వేగంగా వ్యాప్తి చెందడంతోపాటు తీవ్రత పెరిగిం ది. ఫస్ట్‌వేవ్‌లో ఇంటిలో ఒకరికే పరిమితమైతే, ఇప్పుడు అందరూ కోవిడ్‌ బారిన పడుతున్నారు. షుగర్, బీపీ పేషెంట్లకు రెండుదశల్లోనూ ఒకే చికిత్స చేస్తున్నాం. స్టెరాయిడ్స్‌ వాడ కంతో షుగర్‌ లెవల్స్‌తో పాటు బీపీ పేషెంట్లలో రక్తపోటు పెరుగుతోంది. సెకండ్‌వేవ్‌లో మధుమేహం ఉన్నవారిలో బ్లాక్‌ఫంగస్‌ కేసులు వస్తున్నాయి. రెండూ ఉన్న వారిలో ‘ఇమ్యూనిటీ సప్రెషన్‌’ స్థితి ఎక్కువగా ఉండటంతో పాటు, కోవిడ్‌ ప్రభావం, మందుల ప్రభావంతో షుగర్, బీపీ స్థాయిలు పెరిగి సమస్యలు కాస్త పెరుగుతున్నాయి.  
– డాక్టర్‌ ఎ.నవీన్‌రెడ్డి, జనరల్‌ మెడిసిన్, క్రిటికల్‌ కేర్‌     నిపుణుడు, నవీన్‌రెడ్డి హాస్పిటల్, హైదరాబాద్‌ 

ఇలా చేస్తే మంచిది.. 

  • షుగర్, బీపీ, గుండె సమస్యలున్న వారు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలి  
  • గాలిలో కూడా వైరస్‌ వ్యాపిస్తోంది కాబట్టి ఇళ్లలోనూ మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి 
  • హోం ఐసోలేషన్‌లో ఉన్నపుడు మల్టీ విటమిన్లను బాగా తీసుకోవాలి. విటమిన్‌–డీ 60కే, ప్రీ ప్రో బయోటిక్స్, విటమిన్‌–సీ, ప్రొటీన్లు, జింక్‌ తీసుకోవాలి. ప్రొటీన్‌ ఫుడ్‌ తినలేకపోతే పౌడర్‌ రోజూ తాగాలి. 
  • కోవిడ్‌ సోకినా వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. అందరూ ఆసుపత్రులకు పరిగెత్తుకు వెళ్లొద్దు. వైద్యుల సూచనల మేరకే వ్యవహరించాలి.  
  • తరచూ షుగర్‌ లెవల్స్‌ చెక్‌ చేసుకోవాలి. 300 దాటితే తగిన జాగ్రత్తలు తీసుకుని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. 
  • బీపీ పేషెంట్లు కూడా తరచూ పరీక్షలు చేయించుకోవాలి. 140 నుంచి 80 రక్తపోటు ఉండేలా చూసుకోవాలి.  
  • రెగ్యులర్‌గా తేలికపాటి వ్యాయామాలు చేయాలి.  
  • తాజా ఆకుకూరలు, కాయగూరలు,పండ్లు వంటివి తీసుకోవాలి. అలాగే చేపలు, కోడిగుడ్లు, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. 
  • షుగరున్న వారు తాము తీసుకునే రోజువారీ ‘డయాబెటిక్‌ డైట్‌’ కొనసాగించవచ్చు. 
  • మాంసకృత్తులు, పోషకవిలువలు ఎక్కువగా ఉన్న మటన్, చికెన్, పప్పులు, పండ్లు వంటివి తీసుకుంటే ఎనర్జీ లెవల్స్‌ కూడా పెరుగుతాయి.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top