కరోనా కలకలం: బ్రిటన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా

Corona: Rangareddy Man Came From London Tests Positive - Sakshi

బ్రిటన్‌ నుంచి 301 మంది రాక 

యూకే నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ 

అప్రమత్తమైన యంత్రాంగం

అందరికీ కరోనా పరీక్షలు..

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మళ్లీ కరోనా గుబులు మొదలైంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన జిల్లా వాసి ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లాలో కలకలం రేగుతోంది. యూకేలో కొత్త వైరస్‌ ఉధృతి మొదలైందన్న ప్రచారం దృష్ట్యా.. ఆ దేశం నుంచి జిల్లాకు పలువురు రావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల జిల్లాకు చెందిన 301 మంది ఆ దేశం నుంచి వచి్చనట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. వీళ్లందరి చిరునామాలను గుర్తించడంలో యంత్రాంగం నిమగ్నమైంది. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రంగంలోకి దిగి ఇప్పటివరకు 290 మంది ఆచూకీ కనుగొని ఆర్‌టీ–పీసీఆర్‌ విధానంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఒకరికి మినహా ఇతరులకు కోవిడ్‌ లేదని అధికారులు ధ్రువీకరించారు. చదవండి: మనకూ బృందావన్‌ గార్డెన్స్‌

వీరంతా అక్కడినుంచి బయలుదేరే సమయంలో చేయించుకున్న పరీక్షల్లో నెగెటివ్‌గా తేలినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఇక్కడికి చేరుకున్నాక మరోసారి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. నెగెటివ్‌ వచి్చనా హోం క్వారంటైన్‌ విధించారు. 17 రోజులపాటు ఎవరితోనూ సన్నిహితంగా మెలగకుండా ఇంటికే పరిమితం కావాలని సూచిస్తూ కట్టుదిట్టమైన ఆంక్షల్ని విధించారు. మరో పది మంది ప్రయాణికుల జాడ తెలియాల్సి ఉంది. వీరికి కోసం జల్లెడ పడుతున్నారు. పాజిటివ్‌గా వచి్చన వ్యక్తికి గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)లో వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్‌లను బల్కంపేటలోని నేచర్‌క్యూర్‌ హాస్పిటల్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బ్రిటన్‌ నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారందరి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు దృష్టిసారించారు. లక్షణా లు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వారికి సూచించారు. చదవండి: భారత్‌లో కరోనా: పెరిగిన రికవరీ రేటు

ఎక్కడెక్కడ తిరిగారు?
ఈ నెల 9 తర్వాత యూకే నుంచి జిల్లాకు చేరిన వ్యక్తుల కదలికలతోపాటు సమగ్ర సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. జిల్లాకు ఎప్పుడొచ్చారు? ఏ మార్గం గుండా ఇక్కడికి చేరుకున్నారు? వచి్చన తర్వాత నిబంధనల ప్రకారం హోం క్వారంటైన్‌లో ఉన్నారా? ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎక్కడెక్కడ తిరిగారు? ఎలా వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? విందులకు హాజరయ్యారా? తదితర అంశాల వారీగా పూర్తిస్థాయి సమాచారాన్ని  సేకరిస్తున్నారు. ఇరుగుపొరుగు వారి నుంచి కూడా వివరాలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే జిల్లాలో వేల సంఖ్యలో కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ప్రస్తుతం కూడా నిత్యం సగటున వందకుపైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌ పరిణామాల నేపథ్యంలో మరోసారి జిల్లా ఉలిక్కిపడింది. గతంలో మర్కజ్‌ Ðð ళ్లొచి్చన వారిలో చాలామందికి పాజిటివ్‌ అని తేలడంతో మే, జూన్‌ నెలల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో జన్యు మారి్పడి అయిన కొత్త రకం వైరస్‌ ఉన్నట్లు గుర్తిస్తే అవసరమైన వైద్యం అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top