కరోనా‌ విజృంభణ.. వైఎస్‌ షర్మిల కీలక నిర్ణయం

Corona Effect: YS Sharmila Announced Riley Strikes Postponrd - Sakshi

రిలే నిరాహార దీక్షలు తాత్కాలికంగా వాయిదా 

కోవిడ్‌ విస్తరణతో షర్మిల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షలను తాత్కా లికంగా వాయిదా వేస్తున్నట్టు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆమె కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

గత ఆరేళ్ల కాలంలో ఉద్యోగ నియామకాల విషయంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా యువకులు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి ఉందని, నిరుద్యోగుల బాధలకు చలించి, వారికి భరోసా కల్పించాలనే ఉద్యోగ సాధన దీక్ష చేపట్టామన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తల, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యత కలిగిన నాయకురాలిగా కొలువుల సాధన దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వెల్లడించారు. కొలువులు సాధించే వరకు ఈ పోరాటం కచ్చితంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top