మహబూబ్ నగర్‌: వివాహేతర సంబంధం.. సీఐపై కానిస్టేబుల్‌ దాడి!

Constable Wife extramarital affair with Circle Inspector - Sakshi

సాక్షి, మహబూబ్ నగర్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్‌, సీఐపై దాడికి పాల్పడ్డాడు. మర్మాంగాలు కొసేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం. 

మహబూబ్‌ నగర్‌ జిల్లా సీసీఎస్(సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్) సీఐ ఇఫ్తేకార్ హమ్మద్‌పై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలో పని చేసే కానిస్టేబుల్ జగదీష్‌, సీఐకి దాడికి పాల్పడ్డాడు. కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన సీఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. సీఐ పరిస్ధితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

తన భార్యతో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణతోనే జగదీష్‌ ఈ దాడికి తెగబడినట్లు సమాచారం. ఘటనాస్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. సాయంత్రంకల్లా పూర్తి వివరాలు తెలియజేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top