శభాష్‌ కిరణ్‌..  | The constable who brought life with CPR | Sakshi
Sakshi News home page

శభాష్‌ కిరణ్‌.. 

Mar 2 2023 1:58 AM | Updated on Mar 2 2023 7:26 PM

The constable who brought life with CPR - Sakshi

టేకుమట్ల(రేగొండ): గుండెపోటుతో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడికి పోలీస్‌ కానిస్టేబుల్‌ సీపీఆర్‌ ద్వారా ప్రాణం పోశాడు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

ఓ చికెన్‌ సెంటర్‌లో పనిచేసే వంశీ (35) నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్క సారిగా గుండెపోటుకు గురై రోడ్డుపై పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న బ్లూకోట్‌ కానిస్టేబుల్‌ కిరణ్‌ వెంటనే అతనికి సుమారు 15 నిమిషాలపాటు పీసీఆర్‌ నిర్వహించగా తిరిగి శ్వాస తీసుకున్నాడు.

ఆ తర్వాత వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి పోలీస్‌ వాహనంలో పరకాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనికి సీపీఆర్‌తో తిరిగి ప్రాణం పోసిన పోలీసులను స్థానిక ప్రజలు అభినందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement