టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు అవాస్తవం

Congress MP Manickam Tagore Refutes Rumours Of Coalition With TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న ప్రచారం పూర్తి అవాస్తవమని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ వెల్లడించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై పోరాటం చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ అంగుళం కూడా వెనక్కి తగ్గదని ఆయన ఆదివారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ తప్పుడు ప్రచారాలన్నీ ఆ రెండు పార్టీలే చేస్తున్నాయని తెలిపారు. తమ బలమేంటో మే 6న జరిగే వరంగల్‌ ప్రదర్శనలో నిరూపిస్తామని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top