నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy to visit Station Ghanpur today | Sakshi
Sakshi News home page

నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

Mar 16 2025 1:20 AM | Updated on Mar 16 2025 1:20 AM

CM Revanth Reddy to visit Station Ghanpur today

రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం 

స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల రుణాల పంపిణీ 

అనంతరం కృతజ్ఞత సభలో ప్రసంగించనున్న సీఎం 

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీగా ఏర్పాట్లు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. సుమారు రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు సీఎం చేరుకుంటారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇందిర మహిళా శక్తి స్టాళ్లను సందర్శిస్తారు.

ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను అందజేస్తారు. రూ.700 కోట్ల విలువైన పనులను సీఎం వర్చువల్‌గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం డివిజన్‌ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో నిర్వహించే కృతజ్ఞత సభలో పాల్గొంటారు. 

సీఎం పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఐదు రోజులుగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌బాషా, వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు శనివారం బహిరంగ సభతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంబోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.  

సీఎం టూర్‌ షెడ్యూల్‌ ఇలా.. 
»    మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్‌లో) బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 
»    12.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. 
»    మధ్యాహ్నం 1 గంటకు స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లె హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 
»    1.10 నుంచి 1.20 గంటల వరకు ఇందిర మహిళాశక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ సంఘాలకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు. 
»  1.25 నుంచి 3 గంట లవరకు శివుని పల్లె లో ప్రజాపాలన కా ర్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు.  
»   3.10 గంటలకు శివునిపల్లె హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి 3.45 గంటలకు హెలి కాప్టర్‌లో హైదరా బాద్‌ చేరుకుంటారు.  

Advertisement
 
Advertisement
Advertisement