
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్‌సిటీకి పునాది రాయి పడింది. కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేటలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) కార్యాలయానికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
సుమారు 15 వేల చదరపు అడుగుల్లో రూ.20 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నాలుగు నెలల్లో ఈ భవన నిర్మాణం పూర్తికానుంది. అనంతరం ఫ్యూచర్‌సిటీలో జరిగే అభివృద్ధి పనులు, లేఅవుట్లు, పరిశ్రమలకు ఎఫ్‌సీడీఏ అధికారులు అనుమతులివ్వనున్నట్లు సమాచారం. రావిర్యాల నుంచి అమన్‌గల్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంరేవంత్‌తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా, ఉద్యోగ అవకాశాల కేంద్రంగా, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి మోడల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో భారత్ ఫ్యూచర్ సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మొత్తం 30 వేల ఎకరాల్లో.. 15,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి, మరో 15,000 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్గా(హరిత ఊపిరి)గా కేటాయించింది.