
సాక్షి, ఢిల్లీ: చరిత్రాత్మక బీసీ కులగణన చేశామని.. దీని ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లతో బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదించాము.. అయితే, కేంద్రం ఆమోదించకుండా ఆలస్యం చేస్తోందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లను సాధిస్తామంటూ తేల్చి చెప్పారు.
‘‘తెలంగాణ కుల గణన దేశానికి ఒక రోల్ మోడల్.. ఒక దిక్సూచి. రిజర్వేషన్లపై బీజేపీది వితండ వాదం. బీజేపీకి ఒక రాజ్యాంగం, కాంగ్రెస్ ఒక రాజ్యాంగం దేశంలో లేదు. గుజరాత్, మహారాష్ట్ర, యూపీలలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ఈ ప్రయత్నం చేస్తోంది’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
‘‘డేటా ప్రైవసీ చట్టం వల్లే మేము కుల గణన లెక్కలు బయటపెట్టడం లేదు. తెలంగాణలో 3.9 శాతం మంది తమకు కులం లేదని డిక్లేర్ చేశారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికని మంత్రివర్గంలో చర్చించి శాసనసభలో పెడతాం. శాసనసభలో వివరాలు అడిగితే ఇస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.