కొత్త సచివాలయానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌.. నెల వ్యవధిలో మూడు ప్రారంభాలకు ముహూర్తం?

CM KCR Visits Telangana New Secretariat March 2023 Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నూతన సచివాలయాన్ని ఇవాళ(శుక్రవారం) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సందర్శించారు.  సచివాలయ పనులను పరిశీలించడంతో పాటు సచివాలయ ప్రారంభ తేదీపైనా ఆయన అధికారులతో చర్చించనున్నారు.

మరోవైపు ఏప్రిల్‌ 14వ తేదీన అంబేద్కర్‌ జయంతి సందర్భంగా.. భారీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తెలంగాణ సర్కార్‌ భావిస్తోంది. అదే సమయంలో నెల వ్యవధిలోనే విగ్రహంతో పాటు కొత్త సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో.. సచివాలయ పనులను సైతం ఆయన వేగవంతం చేయాలని అధికారులకు సూచించే అవకాశం కనిపిస్తోంది.   

ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలు సార్లు ఆయన సచివాలయాన్ని సందర్శించి.. పనులను పర్యవేక్షించారు. త్వరలోనే కొత్త ప్రారంభ తేదీని ప్రకటించే ఛాన్స్‌ ఉంది. దాదాపుగా సచివాలయం పనులు పూర్తికాగా, మొన్నీమధ్యే అగ్నిప్రమాదం చోటు చేసుకుంది కూడా. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top