ఈసారి బడ్జెట్‌ ఆశాజనకంగా ఉండనుంది: సీఎం కేసీఆర్‌

CM KCR Says Budget Meeting May Be Starts From March 15th - Sakshi

సాక్షి, హైద‌రాబాద్: గత బడ్జెట్‌ కంటే ఈసారి కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు‌ తెలిపారు. ఆదివారం నుంచి బడ్జెట్‌పై ఆర్థికమంత్రి హరీశ్‌రావు సమావేశాలు జరుపుతారని ఆయన వెల్లడించారు. శనివారం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ ఉ‍న్నతి స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీర్‌ మాట్లాడుతూ.. ఈనెల 15 తర్వాత తెలంగాణ రాష్ట్ర 2021 -22 బడ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

బడ్జెట్‌ ఆశాజనకంగా ఉండనుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తెలిపారు. ఆర్ధిక పద్దులో పొందుపరచాల్సిన శాఖల వారి బడ్జెట్ అంచనాలను, అధికారులు అందించిన ఆర్ధిక నివేదికలను పరిగణలోకి తీసుకుని సీఎం కేసీఆర్‌ పరిశీలించారు.

చదవండి:  ‘బీజేపీ వాళ్ల​కు తెలివి లేదు మన్నులేదు.. తిట్టుడే తిట్టుడు’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top