భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

సాక్షి, హైదరాబాద్: నదీ పరీవాహక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. కొత్తగూడెం, ఏటూరునాగారం, మంగపేట ప్రాంతాల్లో పర్యవేక్షణకు సీనియర్ అధికారులను నియమించాలన్నారు. భైంసా, ఆర్మూర్‌కు వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపాలని సీఎం ఆదేశించారు. లోతట్టుప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. నిరాశ్రయులకు షెల్టర్, భోజన వసతులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.