
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబర్ 10 వరకు పొడిగించింది. సీఎం ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్‌ను ఈ అంశంపై ప్రజా ప్రతినిధులు కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. ఆ వెంటనే ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.