రెట్రోఫిట్ వాహనాలవైపు నగరవాసుల ఆసక్తి
కార్లు, ఆటోలు, బైక్‌లు విద్యుత్ వాహనాలుగా మార్పు
ఇంధన భారం, కాలుష్యం బారి నుంచి ఉపశమనం
సాక్షి, సిటీబ్యూరో: కార్లు, ఆటోలు, బైక్‌లు ఏవైనా సరే 10–15 ఏళ్లు దాటిన తర్వాత చాలామంది తక్కువ ధరకు అమ్మేయడంగానీ, షెడ్డుకు పరిమితం చేయడంగానీ చేస్తుంటారు. కానీ, కేంద్రం రెట్రోఫిట్ పాలసీకి ఆమోదముద్ర వేయడంతో వాహనదారులు తమ ఆలోచనను మార్చుకుంటున్నారు. ఈ పాలసీపై నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. పాత వాహనాలకు కొత్తగా విద్యుత్ జీవం పోయడమే ఈ పాలసీ ఉద్దేశం.
ఏంటీ రెట్రోఫిట్ పాలసీ?
పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వంటి ఇంధనాలతో నడిచే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్(ఐసీఈ) వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ)లుగా మార్చడానికి వీలు కలి్పంచేదే రెట్రోఫిట్ పాలసీ. దీంతో 10–15 ఏళ్లు వాడిన తర్వాత బైక్‌లు, కార్లు, ఆటోలు వంటి వాహనాలను రెట్రో ఫిట్టింగ్‌తో విద్యుత్ వాహనాలుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. వాహనం జీవితకాలం మరో 8–10 ఏళ్లు పెరుగుతుంది.
పర్యావరణానికీ మేలు..
హైదరాబాద్‌లో సుమారు 80–85 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో అత్యధికం ద్విచక్ర వాహనాలే. రోజుకు కొత్తగా సుమారు 2,300 వాహనాలు రోడ్ల మీదికి వస్తున్నాయి. వాహనాల తాకిడితో నగరంలో ఎక్కడ చూసినా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ. మరోవైపు వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాత వాహనాలను విద్యుత్ వెహికిల్స్‌గా మార్చుకునేందుకు వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. పాత ద్విచక్ర వాహనాలనే రెట్రోఫిట్ ద్వారా విద్యుత్ వాహనంగా మార్చుకోవడంతో డబ్బు ఆదా అవడంతోపాటు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వ్యయం ఉండదు. వాహన సామర్థ్యం పెరుగుతుంది. కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయి.
సర్టిఫైడ్ సంస్థల ఎంపికే కీలకం..
బ్యాటరీ వాహనాలుగా మార్చే ముందు రెట్రోఫిట్టింగ్‌కు సరైన సంస్థను ఎంపిక చేసుకోవడం కీలకం. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ) లేదా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) గుర్తింపు ఉన్న సంస్థల్లో మాత్రమే రెట్రోఫిట్టింగ్ చేయించాలి. ఏఆర్‌ఏఐ, ఐసీఏటీ అ«దీకృత పరీక్షా ఏజెన్సీలు ఆమోదించిన కన్వర్షన్ కిట్‌లను మాత్రమే వినియోగించాలి. బ్యాటరీ భద్రత కోసం రెట్రోఫిట్ కిట్‌లు ఏఐఎస్ 156 (ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్స్)కు అనుగుణంగా ఉండాలి. లేకపోతే బ్యాటరీల్లో నాణ్యత తగ్గినప్పుడు వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎంత ఖర్చవుతుందంటే..
ఒక బైక్‌ను విద్యుత్ వాహనంగా మార్చేందుకు రెట్రోఫిట్ కిట్‌తోపాటు బ్యాటరీకి రూ.60–70 వేలు వరకు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 100–150 కిలోమీటర్ల సామర్థ్యం కావాలంటే బ్యాటరీకి రూ.30–35 వేల వరకు వెచి్చంచాల్సి ఉంటుంది. మోటార్ శక్తి, బ్యాటరీలను బట్టి వాహనం వేగం గంటకు 50–70 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే వాహనదారుల భద్రత, వాహనం సామర్థ్యం దృష్ట్యా వేగాన్ని పరిమితం చేసేందుకు ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్టెంట్ (ఐఎస్‌ఏ)ను అమరుస్తారు.
ఎంత ఖర్చవుతుందంటే..
ఒక బైక్‌ను విద్యుత్ వాహనంగా మార్చేందుకు రెట్రోఫిట్ కిట్‌తోపాటు బ్యాటరీకి రూ.60–70 వేలు వరకు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 100–150 కిలోమీటర్ల సామర్థ్యం కావాలంటే బ్యాటరీకి రూ.30–35 వేల వరకు వెచి్చంచాల్సి ఉంటుంది. మోటార్ శక్తి, బ్యాటరీలను బట్టి వాహనం వేగం గంటకు 50–70 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే వాహనదారుల భద్రత, వాహనం సామర్థ్యం దృష్ట్యా వేగాన్ని పరిమితం చేసేందుకు ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్టెంట్ (ఐఎస్‌ఏ)ను అమరుస్తారు.


