సాక్షి,హైదరాబాద్: ఆధ్యాత్మిక, విద్యా, సామాజిక సేవా రంగాలలో 75 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని చిన్మయ మిషన్ “అమృత మహోత్సవం”ను జనవరి 24, 25 తేదీలలో హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిన్మయ మిషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా 50వేల మందితో గీతా పారాయణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది..
స్వామి చిన్మయానంద (1916–1993) చిన్మయ మిషన్ స్థాపకులు, భగవద్గీత, ఉపనిషత్తుల బోధలను సామాన్య ప్రజలకు చేరేలా చేయడానికి తన జీవితం మొత్తాన్ని అర్పించారు. 1951లో పూణేలో తన మొదటి గీతా జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకూ చిన్మయ మిషన్ 32 దేశాల్లో 330కి పైగా కేంద్రాలతో విస్తరించింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నట్లు చిన్మయ మిషన్ తెలిపింది.


