Chicken Sales In Hyderabad: అయ్య బాబోయ్‌.. రికార్డు స్థాయిలో చికెన్‌ లాగించేశారు

Chicken Sales at Record Levels in Hyderabad Over Sankranti Festival - Sakshi

మూడ్రోజుల్లో 60 లక్షల కిలోలు హాంఫట్‌  

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ప్రజలు సంక్రాంతి పండగకు రికార్డు స్థాయిలో చికెన్‌ లాగించేశారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుమారు 60 లక్షల కిలోల చికెన్‌ కొనుగోలు చేశారు. ప్రధానంగా మటన్‌ కంటే చికెన్‌ వైపే ప్రజలు మొగ్గుచూపారు. ఇందుకు కారణం చికెన్‌ ధర మటన్‌ కంటే తక్కువగా ఉండటమే. మాంసం కిలో రూ.850– రూ.900 ఉండగా.. చికెన్‌ రూ.240 పలికింది. గ్రేటర్‌ పరిధిలో సాధారణంగా రోజుకు 10 లక్షల కిలోల చికెన్‌ వినియోగం అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

శుక్ర, శనివారాల్లో దాదాపు 30 లక్షల కిలోల చికెన్‌ విక్రయాలు జరగగా.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 30 లక్షల కిలోల చికెన్‌ అమ్ముడుపోయినట్లు అంచనా. మామూలు రోజుల్లో మటన్‌ రెండు లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి. ఇక ఆదివారం ఐదు లక్షల కిలోల మటన్‌  గ్రేటర్‌ ప్రజలు కొనుగోలు చేశారు. గత మూడు రోజుల్లో మటన్‌ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోల విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు  అంచనా వేస్తున్నారు. 

చదవండి: (మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్‌ పరిస్థితి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top