మళ్లీ టీఆర్‌ఎస్‌ గూటికి నల్లాల ఓదెలు దంపతులు

Chennuru Ex MLA Nallala Odelu Return To TRS party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్యే నల్లాల దంపతులు తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. కొద్దిరోజుల కిందట ఓదెలు తన భార్య, మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్మన్‌ భాగ్యలక్ష్మితో కలిసి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

తాజాగా ఆయన మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తిరిగి టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వారికి గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. 2009, 2014లో టీఆర్‌ఎస్‌ తరపున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా నల్లాల ఓదెలు గెలుపొందారు. 

చదవండి: (Hyderabad: బ్యాగ్‌లో 35 వజ్రాలు.. పార్క్‌ హయత్‌లో చోరీ జరిగిందా? మర్చిపోయారా?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top