
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఐలమ్మ 126 జయంతి కార్యమ్రంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, హైదరాబాద్ నగర మాజీ మేయర్ కార్తీకరెడ్డిలతో పాటు పలువురు పార్టీ పదాధికారులు పాల్గొన్నారు.