వరద ప్రాంతాలను పరిశీలించిన కేం‍ద్ర బృందం

Central Team Visited Flood Areas in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీగా కురిసిన వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. దీంతో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృందం శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించింది. కర్మాన్‌ఘాట్‌, మీర్‌పేట నాలాలను కేంద్ర బృందం పరిశీలించింది. ఉదయ్‌నగర్‌, మల్‌రెడ్డి రంగారెడ్డినగర్‌, తపోవన్‌ కాలనీలో 2వేల ఇళ్లు ముంపునకు గురైనట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం సరూర్‌నగర్ చెరువును బృందం పరిశీలించింది. వరదల కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాలను పరిశీలించిన ప్రవీణ్‌ వశిష్ఠ నేతృత్వంలోని కేం‍ద్రబృందం 

 దిల్ ఖుశ గెస్ట్ హౌస్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ  అయ్యింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వరద నష్టానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని కిషన్‌ రెడ్డి కేం‍ద్ర బృందాన్ని కోరారు.  అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టానికి సంబంధించి సమగ్ర రిపోర్టు ఇంకా అందలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమర్జెన్సీ రిలీఫ్ కింద స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులను వెంటనే రాష్ట్రప్రభుత్వం ఖర్చు పెట్టాలని మంత్రి కిషన్ రెడ్డి కోరారు. బల్కంపేట,అంబర్ పేట, బషీర్బాగ్ అమ్మవారి గుళ్లలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. 

చదవండి: వరదలు: కేంద్ర మంత్రి 3 నెలల జీతం విరాళం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top