స్టాఫ్‌ నర్స్‌.. ఇక నర్సింగ్‌ ఆఫీసర్‌ | The Center has changed the names of many posts | Sakshi
Sakshi News home page

స్టాఫ్‌ నర్స్‌.. ఇక నర్సింగ్‌ ఆఫీసర్‌

May 10 2023 4:09 AM | Updated on May 10 2023 4:09 AM

The Center has changed the names of many posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్టాఫ్‌ నర్సు హోదాను నర్సింగ్‌ ఆఫీసర్‌గా కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. అలాగే అనేక నర్సింగ్‌ పోస్టుల హోదాలను మార్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్, ఈఎస్‌ఐ, రైల్వే ఆసుపత్రులు సహా ఇతర ఆసుపత్రుల్లో కొత్త హోదాను అమలు చేస్తోంది. దీన్ని కొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. ఆ ప్రకారం తెలంగాణలోనూ నర్సింగ్‌ పోస్టుల్లో ఉన్న వారికి కొత్త హోదాలు ఇవ్వాలని నర్సులు కోరుతున్నారు.

హోదాను మార్చడం వల్ల సమాజంలో గౌరవం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేంద్రం వీటిని తె చ్చింది. హోదాను మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికపరమైన భారం ఏమీ ఉండదంటున్నారు. బీఎస్సీ నాలుగేళ్లు, ఎంఎస్సీ రెండేళ్లు, పీహెచ్‌డీ ఏళ్లు చదివినా కూడా ప్రాథమికంగా స్టాఫ్‌ నర్సు పోస్టే ఉంటుంది. దీనివల్ల ఉన్నతస్థాయిలోని నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన వారు సరైన గౌరవం పొందలేకపోతున్నారని చెబుతున్నారు.

ఆసుపత్రుల్లో అనేక విధానపరమైన నిర్ణయాల్లో డాక్టర్లు భాగస్వాములుగా ఉంటున్నారని, అధిపతులుగా కూడా వారే ఉంటున్నారన్న విమర్శలున్నాయి. ఇలా నర్సులపై వివక్ష కొనసాగుతోందన్న ఆందోళన ఉంది. పైగా నర్సింగ్‌ డైరెక్టరేట్‌ లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు నర్సులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement