కేసీఆర్‌కు ప్రముఖుల పరామర్శ | Celebrities visit KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు ప్రముఖుల పరామర్శ

Dec 14 2023 4:30 AM | Updated on Dec 14 2023 3:57 PM

Celebrities visit KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును బుధవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సినీ నటుడు నాగార్జున ఉన్నారు.

కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో రాష్ట్ర ప్రణాళిక బోర్డు మాజీ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్, మాజీ మంత్రి హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement