కార్లను కుమ్మేసి.. మనుషులను పొడిచేసి.. 

Cattle Attack People At  Kamareddy District - Sakshi

కామారెడ్డిలో హల్‌చల్‌ చేసిన ఆవు

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఓ ఆవు విధ్వంసం సృష్టించింది. రోడ్లపై కనబడిన వారినల్లా పొడిచింది. అలాగే, వాహనాలపైనా ప్రతాపం చూపింది. మూడు గంటలపాటు ఆవు సృష్టించిన గందరగోళంతో అశోక్‌నగర్, శ్రీనివాసనగర్‌ కాలనీ వాసులు హడలిపోయారు. కనిపించిన వారినల్లా పొడవడంతో జనం రోడ్లపై పరుగులు తీశారు.

పార్క్‌ చేసి ఉన్న కార్లను సైతం వదలకుండా కొమ్ములతో కుమ్మడంతో నాలుగు కార్లు దెబ్బతిన్నాయి. ఆవు దాడిలో ముగ్గురికి గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. చివరకు పోలీసులు, పశువైద్య అధికారులు చేరుకుని తాళ్ల సాయంతో ఆవును బంధించి మత్తు మందు ఇచ్చి నియంత్రించారు.దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top