సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో పుష్ప సినిమా రేంజ్‌లో జరిగిన అక్రమ గోవుల రవాణా ప్రయత్నాన్ని పంతంగి టోల్ ఫ్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. లారీ పైభాగంలో ఉల్లిగడ్డల లోడు, కిందభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గూహల వంటి ఖాళీలో గోవులను దాచిపెట్టి తరలించేందుకు ముఠా ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు లారీని ఆపి పరిశీలించగా వైజాగ్ నుంచి హైదరాబాదులోని ఒక కబేళాకు గోవులను తరలిస్తున్నట్టు బయటపడింది. లారీ క్రింద భాగాన్ని పాలిష్ బోర్డులతో కప్పి చిన్న గాలి రంధ్రాలు ఉంచి పైన ఉల్లిగడ్డల సంచులతో పూర్తిగా మూసివేసి ఎవరికీ అనుమానం రాకుండా ముఠా చాకచక్యంగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.
గోవుల రవాణా చేసిన వారిపై కేసు నమోదు చేసి డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


