కేసీఆర్‌ తోడల్లుడిపై కేసు నమోదు

Case Filed On Joginapally Santosh Kumar Father Ravinder  - Sakshi

కరీంనగర్‌క్రైం: మాజీ సీఎం కేసీఆర్‌ తోడల్లుడు, రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్‌ రావు తండ్రి రవీందర్‌రావుపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్‌ టూటౌన్‌ సీఐ వెంకటేశ్‌ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ముఖ్య అనుచరుడు కరీంనగర్‌లోని రాంనగర్‌కు చెందిన కూస రవీందర్‌ భూదందాలకు పాల్పడుతున్నాడని ఓ యూట్యూబ్‌ చానల్‌లో వార్త ప్రసారం చేశారు. మిడ్‌మానేరు భూ నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లలో భూకబ్జాకు పాల్పడ్డాడని, అక్రమ పట్టా ఇవ్వమని సిరిసిల్ల ఆర్డీవోను బెదిరింపులకు గురిచేశాడని పేర్కొన్నారు.

అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని, తప్పుడు విషయాన్ని కొందరు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని.. దీని వెనుక కేసీఆర్‌ తోడల్లుడు జోగినపల్లి రవీందర్‌ రావు, గూడ బాలకృష్ణ, ఎ.నాగరాజు, సంపత్‌ ఉన్నారని కూస రవీందర్‌ ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జోగినపల్లి రవీందర్‌ రావు, గూడ బాలకృష్ణ, ఎ.నాగరాజు, సంపత్‌, యూట్యూబ్‌ చానెల్‌ నిర్వాహకుడు చిలుక ప్రవీణ్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.ల

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top