ఎద్దు ఖరీదు రూ.1.3 లక్షలు | Sakshi
Sakshi News home page

ఎద్దు ఖరీదు రూ.1.3 లక్షలు

Published Mon, Feb 6 2023 2:04 AM

Bull Sold For Rs 1. 3 Lakh In Biggest Cattle Fair In Sangareddy - Sakshi

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): సంగారెడ్డి జిల్లాలోని న్యాల్‌కల్‌ గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఉర్సే షరీఫ్‌ పీర్‌ గైబ్‌ సాహెబ్‌ దర్గా ఉత్సవాల్లో ఆదివారం భారీ పశువుల సంత నిర్వహించారు. ఝరాసంగం మండల పరిధిలోని ప్యాల వరం గ్రామానికి చెందిన రైతు తన ఎడ్ల జత ధర రూ.3 లక్షలని చెప్పగా.. అందులోని ఒక్క ఎద్దును మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామానికి చెందిన రైతు సంగమేశ్వర్‌ రూ.1.3 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు.

మరో ఎడ్ల జత రూ.1.45 లక్షలు పలికింది. సదాశివపేట మండలం కొల్కూర్‌కు చెందిన శివకుమార్‌ అనే రైతు తన ఆవు ధర రూ.6 లక్షలుగా నిర్ణయించగా.. రూ.3 లక్షలకు ఇవ్వమని రైతులు కోరినా అంగీకరించలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement