కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌.. సుబేదారి స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రికత్త.. | Huzurabad BRS MLA Padi Kaushik Reddy Arrest Related Updates, Top News Headlines And Viral Videos | Sakshi
Sakshi News home page

కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌.. సుబేదారి స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రికత్త..

Jun 21 2025 10:27 AM | Updated on Jun 21 2025 1:58 PM

BRS MLA Kaushik Reddy Arrest Related Updates

కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ అప్‌డేట్స్‌.. 

సుబేదారి స్టేషన్‌ వద్ద ఉద్రికత్త.. 

  • వరంగల్‌లోని సుబేదారి స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
  • సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించిన బీఆర్ఎస్ శ్రేణులు
  • బీఆర్‌ఎస్‌ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం
  • ఓటు నోటుకు దొంగ.. రేవంత్ రెడ్డి దొంగ అంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు మండిపడుతున్నారు.
  • సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు
  • దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు
  • ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు, మడికొండ పీఎస్‌కు తరలింపు

సుబేదారి స్టేషన్‌కు కౌశిక్ రెడ్డి సతీమణి శాలినిరెడ్డి..

  • సుబేదారి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
  • కౌశిక్ రెడ్డిని కలిసి పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.
  • పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన ఆయన సతీమణి శాలినిరెడ్డి
  • పోలీసులతో కేసు వివరాలపై ఆరాతీసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి, కౌశిక్ సతీమణి.
  • పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతున్న హైడ్రామా
  • వరంగల్ పోలీస్ కమిషనర్‌ను కలిసేందుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్ళిన బీఆర్‌ఎస్‌ నేతలు, లీగల్ సెల్ బృందం
  • కోర్టుకు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు

 

ఎర్రబెల్లి కామెంట్స్‌.. 

  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డిపైన కేసులు ఇదే ప్రథమం కాదు
  • అసెంబ్లీ ప్రశ్నిస్తూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కౌశిక్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
  • ఏప్రిల్‌లో కేసు పెట్టారు..
  • సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఇన్ని రోజులు కాలయాపన చేశారు..
  • కేసు పెట్టిన వ్యక్తిపై అనేక ఆరోపణలు ఉన్నాయి
  • రేవంత్ రెడ్డి స్థాయిలో ఒత్తిడి తెచ్చి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు.
  • కేసీఆర్‌, కేటీఆర్‌పై కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు
  • రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాళా తీసింది..
  • దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి..
  • రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ప్లాప్..
  • పరిపాలన కంట్రోల్‌లో లేదు.. ఎవరికి వారు దోచుకు తింటున్నారు..

 

👉బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ నేపథ్యంలో వరంగల్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకింది. అక్రమ కేసులో అరెస్టయిన కౌశిక్‌ రెడ్డిని పరామర్శించడానికి బీఆర్‌ఎస్‌ నేతలు భారీ సంఖ్యలో పీఎస్‌ వద్దకు చేరుకున్నారు.  దాస్యం వినయ్‌ భాస్కర్‌, రాకేశ్‌ రెడ్డి తదతరులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.

👉ఈ క్రమంలో పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా స్టేషన్‌ బయటే అడ్డుకున్నారు. పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకున్నది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

 

 

👉హరీష్‌ రావు సీరియస్‌.. 

  • కౌశిక్‌ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.
  • పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది.
  • రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది.
  • ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నడు.
  • కేసులు, అరెస్టులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు.
  • నీ వైఫల్యాలను నిలదీస్తాం, నమ్మించి నయవంచన చేసిన నీ మోస పూరిత వైఖరిని ప్రజా క్షేత్రంలో ఎండగడతాం.
  • అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

👉అయితే, మనోజ్‌ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఎమ్మెల్యే తరచూ బెరదింపులకు దిగుతున్నాడని, రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని మనోజ్‌రెడ్డి భార్య కట్టా ఉమాదేవి హనుమకొండ సుబేదారి పోలీసులకు ఏప్రిల్‌లో ఫిర్యాదు చేశారు.

👉దీనిపై 308(2), 308(4), 352 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మరికాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి కౌశిక్‌ రెడ్డిని తరలించనున్నారు. అక్కడి నుంచి జడ్జి ముందు హాజరుపరుచనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement