‘ఎల్‌నినో ప్రమాదాన్ని కాంగ్రెస్‌ పట్టించుకోలేదు’ | BRS Leader Harish Rao Slams Revanth Reddy Sarkar | Sakshi
Sakshi News home page

‘ఎల్‌నినో ప్రమాదాన్ని కాంగ్రెస్‌ పట్టించుకోలేదు’

Oct 26 2026 8:01 PM | Updated on Oct 26 2026 8:10 PM

BRS Leader Harish Rao Slams Revanth Reddy Sarkar

హైదరాబాద్‌:  ఎల్‌నినో పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తన చేతకానితనాన్ని ప్రకృతిపై నెట్టే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. గత ఆరు నుంచి తొమ్మిది నెలలుగా ఎల్‌నినో ముప్పు ఉందని తెలుస్తున్నప్పటికీ, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 

గోదావరి, కృష్ణా జలాల నుంచి నీటిని ఎందుకు లిఫ్ట్ చేయలేదని, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, తాగు - సాగు నీటి లభ్యతపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో వల్ల పంటలు వేసుకోవద్దని సీఎం చెప్పడం రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తోందని విమర్శించారు. 

‘ఎల్‌నినో ప్రమాదాన్ని కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. నీళ్లు ఉన్నా తీసుకునే తెలివి ప్రభుత్వానికి లేదు. ఎక్కడా లేని క్రాప్‌ హాలీడే తెలంగాణలోనే ఎందుకు?, రాష్ట్రానికి కరువు తెచ్చిందే కాంగ్రెస్‌ ’ అని మండిపడ్డారు.

ఇదీ చదవండి:  చనిపోతేనే బిల్లులు ఇస్తారా? చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే అనిరుధ్
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement