వీవీని కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి

Bombay HC Permits Family Members To Visit Varavara Rao - Sakshi

ముంబై : భీమా కొరేగావ్‌ కేసులో నిర్భంధంలో ఉ‍న్న విప్లవ రచయిత వరవరరావును(వీవీ) కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ప్రస్తుతం కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కలిసేందుకు బాంబే హైకోర్టు వారికి అనుమతిచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు, ఆస్పత్రి ప్రొటోకాల్‌కు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు వీవీ ఆరోగ్యంపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని న్యాయస్థానం నానావతి ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది. (అయోధ్య రామాలయ భూమిపూజపై భిన్న స్వరాలు)

కాగా, భీమా కొరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వీవీ ఏడాదిన్నరగా తలోజా జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వీవీని కలిసేందుకు తమకు అనుమతించాలని.. ఆయన తానుగా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నందున సహకరించేందుకు కుటుంబసభ్యులలో ఒకరిని అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సంఘాలు కూడా ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top