సాక్షి, తాడేపల్లి: సాల్మన్ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాల చేతిలో సాల్మన్ హత్యకు గురైన సంగతి తెలిసిందే.. జరిగిన దారుణాన్ని వైఎస్ జగన్‌కు సాల్మన్ కుటుంబసభ్యులు వివరించారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.
‘‘దళిత కార్యకర్త మందా సాల్మన్‌ను టీడీపీ గూండాలు పొట్టనపెట్టుకున్నారు. ఆ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీద, నాయకులమీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో మనుషుల భద్రతకు భరోసా లేని పరిస్థితి ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు. సాల్మన్ ఘటనలో బాధ్యులను కచ్చితంగా చట్టంముందు నిలబెడతాం. వైఎస్సార్సీపీ క్యాడర్ ఎవరూ ఆందోళన చెందవద్దు. పార్టీ నుంచి అన్ని విధాలుగా అండగా నిలుస్తాం’’ అని వైఎస్ జగన్ చెప్పారు.


