BJP MLA Raja Singh Sensational Comments On Protests - Sakshi
Sakshi News home page

పార్ట్‌-2 కూడా ఉంది.. చావడానికైనా రెడీ: రాజాసింగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Aug 23 2022 10:00 AM | Updated on Aug 23 2022 3:19 PM

BJP MLA Raja Singh Sensational Comments On Protests - Sakshi

యాక్షన్‌కు రియాక్షన్‌ ఉందంటూ రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో హై టెన్షన్‌ క్రియేట్‌ చేశాయి. మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్‌.. యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం మజ్లిస్‌ నేతలను ఆగ్రహానికి గురి చేసింది. 

ఈ క్రమంలో రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ మజ్లిస్‌ నేతలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మరోవైపు.. రాజాసింగ్‌ వీడియోపై ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్‌.. ముస్లింల మనోభావాలు కించపరిచారంటూ మజ్లిస్‌ నేతలు ఆందోళనలకు దిగారు. మంగళవారం ఉదయం ఎంఐఎం ఎమ్మెల్యే బలాల.. సీపీ కార్యాలయానికి వెళ్లారు. రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక, ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో​ పోలీసులు.. యూ ట్యూబ్‌ను రాజాసింగ్‌ వీడియో తొలగించాలని కోరారు. పోలీసుల అభ్యర్థన మేరకు యూ ట్యూబ్‌ వివాదాస్పద వీడియోను తొలగించింది. 

ఇదంతా జరుగుతున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం మీడియాతో​ మాట్లాడుతూ.. మునావర్‌కు కౌంటర్‌ వీడియోలు చేస్తానని ముందే చేప్పాను. కౌంటర్‌ వీడియోను యూట్యూబ్‌లో తొలగించారు. రెండో భాగం వీడియో త్వరలో అప్‌లోడ్‌ చేస్తాను. యాక్షన్‌కు రియాక్షన్‌ కచ్చితంగా ఉంటుంది. నాపై ఎలాంటి చర్యలకు దిగినా నేను సిద్ధం. ధర్మం కోసం నేను చావడానికైనా రెడీగా ఉన్నాను. 

ఇది కూడా చదవండి: మహ్మద్‌ ప్రవక్తపై రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో హైటెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement