
కల్హేర్(నారాయణఖేడ్): ధర్మం కోసం పని చేస్తున్న తనను అంతం చేసేందుకు కొన్నిశక్తులు కుట్ర చేస్తున్నాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గరిడెగాంలో ఆదివారంనాడు శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
తన నోరు మూయించాలని చూస్తే.. వంద మంది రాజాసింగ్‌లు పుట్టుకొస్తారన్నారు. కొందరు విదేశాల నుంచి డబ్బు పంపి మతమార్పిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన చంద్రశేఖర్ మహరాజ్, మాజీ ఎమ్మెల్యేలు విజయపాల్‌రెడ్డి, గంగారం, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆలె భాస్కర్ పాల్గొన్నారు.