
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ తమిళ సైపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్ సైదిరెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహిత్యమని బీజేపీ నేత రావుల శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షురాలిగా గవర్నర్ మాట్లాడుతున్నారనడం శోచనీయమన్నారు. (గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఆగ్రహం)
ఎమ్మెల్యే సైదిరెడ్డి వెంటనే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని రావుల శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను టీఆర్‌ఎస్ అదుపులో పెట్టుకోవాలని సూచించారు.