చిల్లర పనులు మానండి

BJP Leader Etela Rajender Reacts About Teenmar Mallanna Arrest Case - Sakshi

తీన్మార్‌ మల్లన్న అరెస్టుపై ఈటల

హుజూరాబాద్‌: అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే వారిని అడ్డుకోలేరని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. తీన్మార్‌ మల్లన్న మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, మల్లన్నకు మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నించే గొంతును నొక్కివేయడం కేసీఆర్‌ ప్రభుత్వానికి అలవాటైందన్నారు. ఇలాంటి చిల్లర పనులు మానుకోవడం మంచిదని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాల అమలు తీరుపై క్షేత్రస్థాయిలోని పరిస్థితులను అధ్యయనం చేయడమే లక్ష్యంగా సాగుతున్న బండి సంజయ్‌ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ విజయవంతం కావాలని ఈటల ఆకాంక్షించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top