గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి: బండి సంజయ్‌ | BJP Bandi Sanjay Demands Notification For Group 1 2 And 3 Posts | Sakshi
Sakshi News home page

గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి: బండి సంజయ్‌

Jan 21 2022 5:00 AM | Updated on Jan 21 2022 5:00 AM

BJP Bandi Sanjay Demands Notification For Group 1 2 And 3 Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌ సర్వీసెస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో గ్రూప్‌–1 పోస్టులు 1,600, గ్రూప్‌–2 పోస్టులు 4 వేలు, గ్రూప్‌–3 పోస్టులు 2 వేలు, గ్రూప్‌–4 పోస్టులు 40 వేలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసుల్లో 25 ఏళ్లుగా జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. గ్రూప్‌–1 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఒక్కో ఐఏఎస్‌ అధికారి 3, 4 పోస్టులకు ఇన్‌చార్జ్‌గా కొనసాగాల్సిన దుస్థితి తలెత్తిందని మండిపడ్డారు. పేదలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందకుండా పోతున్నాయని సంజయ్‌ విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement