బెల్, హైదరాబాద్‌లో ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ జాబ్స్‌

BEL Hyderabad Recruitment 2021: Trainee, Project Engineer Posts Full Details Here - Sakshi

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌), హైదరాబాద్‌ యూనిట్‌.. ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

► మొత్తం పోస్టుల సంఖ్య: 84

పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్లు–33, ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు–51.

ట్రెయినీ ఇంజనీర్లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 31.12.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు  రూ.28,000, మూడో ఏడాది నెలకు రూ.31,000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 31.12.2021 నాటికి 28ఏళ్లు మించకూడదు. వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.40,000, మూడో ఏడాది నెలకు రూ.45,000, నాలుగో ఏడాది నెలకు  రూ.50,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)లో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ఐ.ఈ.నాచారం, హైదరాబాద్‌–500076, తెలంగాణ చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరితేది: 31.12.2021

► వెబ్‌సైట్‌: bel-india.in

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top