బండి సంజయ్‌ పాదయాత్ర–3 వాయిదా  | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌ పాదయాత్ర–3 వాయిదా 

Published Thu, Jun 2 2022 4:19 AM

Bandi Sanjay  Padayatra 3 postponed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈనెల 23 నుంచి చేపట్టనున్న ప్రజా సంగ్రామయాత్ర–3 తాత్కాలికంగా వాయిదా పడింది. వచ్చేనెల 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీ ముగిశాక వారం, పదిరోజుల వ్యవధిలో సంజయ్‌ పాదయాత్ర–3ను మొదలుపెడతారని పార్టీ వర్గాల సమాచారం.

తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా జరగనున్న ఈ సమావేశాలకు పార్టీపరంగా అత్యంతప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నాయకత్వం దీని నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీకి చెందిన అగ్రనాయకత్వం, హేమాహేమీల వంటి నేతలు, బీజేపీ పాలిత సీఎంలు,, ముఖ్యనేతలంతా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నందున దానికి తగ్గట్టుగా రవాణా, వసతి, భోజనం, ఆహ్వానం, ప్రొటోకాల్, తదితర ఏర్పాట్ల నిమిత్తం పలు కమిటీలను ఏర్పాటు చేసే సన్నాహాల్లో రాష్ట్ర పార్టీ నిమగ్నమైంది.    

Advertisement
 
Advertisement
 
Advertisement