ప్రజలు వీఆర్‌ఎస్‌ ఇచ్చారనే కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పాట.. బండి సంజయ్‌ ధ్వజం

Bandi Sanjay Comments On KCR National Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ పార్టీని పెట్టబోయే ముందు తెలంగాణకు సీఎం కేసీఆర్‌ ఏం చేశారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు వీఆర్‌ఎస్‌ ఇచ్చినందునే కేసీఆర్‌ భారత్‌ రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎస్‌) పాట పాడుతు న్నారని ఎద్దేవాచేశారు. ప్రజాస్వా మ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవ చ్చని, అయితే కేసీఆర్‌ మాత్రం టైంపాస్‌ రాజకీ యాలు చేస్తున్నారని మండి పడ్డారు.

తెలం గాణలో చేసేదేం లేక రాష్ట్రంలో పాల నను కుటుంబానికి అప్పగించి దేశాన్ని ఏలేం దుకు సిద్ధమయ్యారని విమర్శించారు. శని వారం సంజయ్‌ మీడియాతో మాట్లా డుతూ కేంద్రంలో 8 ఏళ్ల మోదీ పాలనపై, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీరుపై సీఎం బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసి పుట్టబోయే బిడ్డ తలపై కూడా తలసరి రూ.లక్షకు పైగా అప్పుల భారాన్ని మోపడంపై కేసీఆర్‌ ఏం సమా« దానం చెబుతారని నిలదీశారు. ప్రపం చంలో భారత్‌ను తమ మేటి అయిన పాలనతో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిపితే, కేసీఆర్‌ తెలంగాణను కులాలు, మతాలు, వర్గాల పేరుతో విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. 

అధిక ఫీజులు వసూళ్లపై చర్యలు
‘పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ‘మన ఊరు–మన బడి’ కి కేంద్రమే 75% నిధులు కేటాయిస్తోందని బండి సంజయ్‌ తెలిపారు. ఈనెల 13 నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నందున నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top