‘గుండు’ను గుర్తించని యాప్‌ | App that does not recognize workers | Sakshi
Sakshi News home page

‘గుండు’ను గుర్తించని యాప్‌

Jun 3 2026 4:08 AM | Updated on Jun 3 2026 4:08 AM

App that does not recognize workers

వీర్నపల్లి(సిరిసిల్ల): సాంకేతికత పెరిగే కొద్దీ ఉపాధి కూలీలకు తిప్పలు తప్పడం లేదు. ఫేస్‌ను గుర్తుపట్టాల్సిన యాప్‌.. గుండు గీయించుకున్నారనే కారణంతో ముఖం చాటే సింది. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్న పల్లి మండలం రంగంపేటలో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ తండాకు చెందిన కూలీలు బానోతు శ్రీను, తులసిరామ్, తిరుపతి, హంస, ప్రకాశ్‌ ఇటీ వల వేములవాడ రాజన్న సన్నిధిలో తల వెంట్రుకల మొక్కు చెల్లించుకున్నారు. 

మంగళవారం ఉపాధి పనులకు హాజరయ్యారు. వీరి హాజరును యాప్‌లో నమోదు చేసేందుకు మేట్‌ ఫొటో తీయగా అది గుర్తించలేదు. గతంలో జుట్టుతో ఉన్న ఫొటోలు సిస్టమ్‌లో ఉండగా, ప్రస్తుతం గుండుతో ఉన్న వీరి ముఖా లను గుర్తుపట్టలేదు. బైక్‌ కవర్లను వారి గుండుపై కప్పి ఫొటో తీయగా యాప్‌లో హాజరు నమోదైంది. దీంతో సదరు కూలీలు హమ్మయ్య అంటూ పనుల్లో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement