సింగిల్‌ ఎజెండా.. టార్గెట్‌ సెంటర్‌!

Aim Of Assembly Sessions Is To Highlight Center Injustice To state - Sakshi

రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపడమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలు 

బీజేపీ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టిన సీఎం, మంత్రులు 

లఘు చర్చల సందర్భంగా తీవ్రస్థాయిలో ధ్వజం 

బీజేపీ, టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై కాంగ్రెస్‌ విమర్శలు 

బీజేపీ సభ్యుడు రఘునందన్‌ ఒంటరి పోరాటం..

మొత్తం 3 రోజులు .. 11 గంటల పాటు సభ 

రెండు తీర్మానాలు, ఎనిమిది బిల్లులకు ఆమోదం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కొనసాగాయి. 6, 12, 13 తేదీల్లో సమావేశాలు జరిగాయి. శాసనసభ 11 గంటల పాటు, శాసన మండలి 11 గంటల 2 నిమిషాల పాటు కొనసాగాయి. 3 రోజుల ఎజెండాలో చేపట్టిన అంశాలను పరిశీలిస్తే కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపడమే టార్గెట్‌గా ప్రభుత్వం సభను నడిపిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేంద్ర విద్యుత్‌ చట్టం–పర్యవసానాలు, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమలులో కేంద్రం ద్వంద్వ వైఖరి, రాష్ట్ర విభజన హామీల అమలు అంశాలపై జరిగిన మూడు లఘు చర్చల్లోనూ కేంద్రం తీరును రాష్ట్ర ప్రభుత్వం ఎండగట్టింది. కేంద్ర విద్యుత్‌ చట్టంపై జరి గిన చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బీజేపీ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తడమే కాకుండా, తాను చెప్పింది తప్పయితే రాజీనామాకు కూడా సిద్ధమంటూ సంచలన వ్యాఖ్య లుచేశారు. ఎఫ్‌ఆర్‌బీఎంపై జరిగిన చర్చలో పాల్గొన్న మంత్రి హరీశ్‌.. కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. ఈ లఘు చర్చల్లో పాల్గొన్న ఇత రమంత్రులు, అధికార పార్టీ సభ్యులు కూడా కేంద్రాన్ని తూర్పారబట్టారు. వీరికి ఎంఐఎం సభ్యులు కూడా జత కలిశారు. ఇక, కాంగ్రెస్‌ పార్టీ.. బీజేపీ తప్పులను ఎత్తిచూపుతూనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా సభ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈసారి ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. రాజాసింగ్‌ జైలుకు వెళ్లడం, ఈటలను సభ నుంచి సస్పెండ్‌ చేయడంతో రఘునందన్‌ ఒక్కరే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ దాడిని ఎదుర్కొంటూ కేంద్రాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు.  

నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాసం 
మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం శాసనసభలో మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరిగింది. కేటీఆర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సభ్యుల సంఖ్యను బట్టి కోఆప్షన్‌ సభ్యుల సంఖ్యను పెంచామన్నారు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, జవహర్‌నగర్‌ వంటి చోట్ల కోఆప్షన్‌ సభ్యులను పెంచా మని చెప్పారు. మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు మూడేళ్లు దాటితే చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌లపై అవిశ్వాసం ప్రవేశపెట్టవచ్చని ఉన్న నిబంధనను మార్చేసి దాని వ్యవధిని నాలుగేళ్లకు పెంచామని తెలిపారు. కేతనపల్లి మున్సిపాలిటీని రామకృష్ణాపురం మున్సి పాలిటీగా మార్చామన్నారు. గ్రామపంచాయతీగా కొనసాగుతున్న జిల్లా కేంద్రమైన ములుగు పట్టణాన్ని మున్సిపాలిటీగా మా ర్చుతున్నామన్నారు. తర్వాత బిల్లును సభ ఆమోదించింది. కాగా, మంత్రి తలసాని మంగళవారం ప్రవేశపెట్టిన తెలంగాణ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. అలాగే ఆజామాబాద్‌ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 136.4 ఎకరాల పారిశ్రామిక ప్రాంతంలో కొందరు సొంత లీజుతో పరిశ్రమలు నడుపుతుండగా, మరికొన్నింటికి యజమానులు మారారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. లీజు గడువు ముగి యడంతో పరిశ్రమలు నడుస్తున్న భూములను క్రమబద్ధీకరించి, మిగతావి ప్రజాప్ర యోజనాలకు ఉపయోగిస్తామన్నారు. 

జీరో అవర్, ప్రశ్నోత్తరాలు లేకుండానే.. 
వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈసారి జీరో అవర్, ప్రశ్నోత్తరాలు లేకుండానే ముగిశాయి. ప్రభుత్వ బిల్లులు, సభ్యుల మృతికి సంతా పాలు, లఘుచర్చలకే పరిమితమయ్యాయి. వినాయక చవితి ఉత్స వాలు, ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు జరిగే జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు 3 రోజులకే పరిమితమయ్యాయి. సమావేశాల్లో మూడు అంశాలపై లఘు చర్చ జరగ్గా, రెండు అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఎనిమిది ప్రభుత్వ బిల్లులను ఈ నెల 12న శాసనసభలో ప్రవేశపెట్టగా, మంగళవారం చర్చించి ఉభయ సభలు ఆమోదించాయి. తొలిరోజు దివంగత మాజీ సభ్యులు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌రెడ్డికి సంతాపం ప్రకటించి ఎజెండా లేకుండానే వాయిదా పడింది. ఈ నెల 12న తిరిగి ప్రారంభమైన శాసనసభ రెండోరోజు ఏడు ప్రభుత్వ బిల్లుల సమర్పణకే పరిమితమైంది. చివరిరోజు 13న అనుబంధ ప్రభుత్వ బిల్లుతో పాటు మొత్తం 8 బిల్లులు నామమాత్ర చర్చతో ఆమోదం పొందాయి. 

నిరవధిక వాయిదా 
అసెంబ్లీలో చేపట్టిన మూడు లఘు చర్చ లతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదముంపుపైనా తొలిరోజు శాసన మండలి లఘు చర్చ చేపట్టింది. శాసనసభలో 28 మంది సభ్యులు ప్రసంగించారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు మంగళవారం సాయంత్రం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించడంతో వర్షాకాల సమావేశాలు ముగిశాయి.

ఇదీ చదవండి: ఆనాటి తారకరాముడి డైలాగ్‌తో​ అదరగొట్టిన కేటీఆర్‌.. అసెంబ్లీలో చప్పట్ల మోత!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top