వేడి నీళ్లు పడి ఐదేళ్ల చిన్నారి మృతి

Adilabad: 5 Years Old Child Dies After Falling Into Hot Water - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: మండలంలోని బోదపల్లి గ్రామంలో వేడి నీళ్లు మీదపడి ఐదేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈన్‌గాం ఎస్సై సందీప్‌ తెలతిదపిన వివరాల ప్రకారం గడిల అశోక్‌- సౌజన్యలకు ముగ్గురు పిల్లలు. గత నెల 29న ప్రమదవశాత్తు అభినయ(5)పై వేడినళ్ల కొప్పెన బోర్లా పడింది. వెంటనే కాగజ్‌నగర్‌లోని అసుపత్రికి తరలించారు. అనంతరం వరంగల్‌ ఎంజీఎం, అక్కడినుంచి హైదరబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మళ్లీ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా చిన్నారిని కాపాడలేకపోయారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top