పెళ్లి చేసుకుంటానని మోసగించిన యువకుడిపై ఫిర్యాదు  | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని మోసగించిన యువకుడిపై ఫిర్యాదు 

Published Wed, Jan 10 2024 9:40 AM

Actress attack In Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి..ఎనిమిదేళ్లుగా ఓ యువకుడు శారీరకంగా దగ్గరై..మోసానికి పాల్పడ్డాడంటూ ఓ యువతి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మూసాపేట ప్రాంతానికి చెందిన ఓ యువతి(23)కి ఎనిమిదేళ్ల క్రితం గంగినేని గణే‹Ùతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని పిలిపించి ఈ నెల 8వ తేదీన యువతిని గణేష్ పాటు అతని స్నేహితులు తీవ్రంగా హింసించారని ఆమె తొలుత జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు గణేష్‌ తోపాటు అతని స్నేహితులైన శ్రీను, వంశీ, శ్రీకాంత్, అక్షయ్‌ తదితరులపై రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారు.

కాగా మంగళవారం రాత్రి బాధిత యువతి జూబ్లీహిల్స్‌ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లి చేసుకుంటానని గణేష్‌ నమ్మించాడంతోపాటు మరికొంతమంది యువతులతో సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపించింది. ఈమేరకు పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా, తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ యువతి ఇచ్చిన మరో ఫిర్యాదు మేరకు గణేష్‌పై ఐపీసీ సెక్షన్‌ 376, 417, 420 తదితర సెక్షన్ల కింద జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement