Telangana: చెక్‌పోస్టుల్లో ఏసీబీ మెరుపు దాడులు.. | ACB Officials Raids At Checkpost In Telangana Cash Seized | Sakshi
Sakshi News home page

Telangana: చెక్‌పోస్టుల్లో ఏసీబీ మెరుపు దాడులు..

Dec 4 2024 2:25 PM | Updated on Dec 4 2024 2:29 PM

ACB Officials Raids At Checkpost In Telangana Cash Seized

సాక్షి, హైద‌రాబాద్: రాష్ట్రంలోని ప‌లు చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఇంటర్‌ స్టేట్‌ చెక్‌పోస్టుల్లో 7 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వ‌హించాయి. లెక్క‌లు చూప‌ని న‌గ‌దును ఏసీబీ బృందాలు సీజ్ చేశాయి.

నల్గొండ విష్ణుపురం చెక్‌పోస్టులో రూ. 86,500, భోర‌జ్(ఆదిలాబాద్) చెక్‌పోస్టులో రూ. 62,500, అలంపూర్ చెక్‌పోస్టులో రూ. 29,200 సీజ్ చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల్లో అవినీతికి పాల్ప‌డుతున్న అధికారుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఎవరైన లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రజలకు సూచించారు.
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement