
దేశీ ఎయిర్‌లైన్స్‌పై 76% మంది ప్రయాణికుల ఆరోపణ..
లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశీ విమానయాన సంస్థలు భద్రత కంటే ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని విమాన ప్రయాణి కులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఇటీవల సర్వే చేపట్టి వారి అభిప్రాయాలను సేకరించింది. సర్వేలో పాల్గొన్న ప్రయాణికుల్లో 76 శాతం మంది విమానాల నిర్వహణకు సంబంధించి భద్రతా లోపాలు ఎక్కువగానే ఉంటున్నాయని పేర్కొ న్నారు.
గత మూడేళ్లలో కనీసం ఒక్కసారైనా టేకాఫ్/ల్యాడింగ్ లేదా విమానంలో ఇబ్బంది ఎదుర్కొన్నట్లు 64 శాతం మంది చెప్పారు. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిరిండియా 171 విమానం కూలిన ఘటన తర్వాత విమాన ప్రయాణికుల్లో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆ ఘటన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట భద్రతాప రమైన, సాంకేతిక లోపాలకు సంబంధించిన ఉదంతాలు నమోదవుతున్న నేపథ్యంలో లోక ల్ సర్కిల్స్ ఈ సర్వే నిర్వహించింది. దేశవ్యా ప్తంగా 44 వేల మంది విమాన ప్రయాణికుల నుంచి మూడేళ్ల ప్రయాణ అనుభవాలను సేకరించింది.