26 నుంచి సోమశిల–శ్రీశైలం లాంచీ ప్రయాణం | From 26th Somashila to Srisailam launch journey starts | Sakshi
Sakshi News home page

26 నుంచి సోమశిల–శ్రీశైలం లాంచీ ప్రయాణం

Oct 25 2024 4:25 AM | Updated on Oct 25 2024 4:25 AM

From 26th Somashila to Srisailam launch journey starts

చిన్నారులకు, పెద్దలకు వేర్వేరుగా టికెట్‌ ధరలు 

అప్‌ అండ్‌ డౌన్‌ ప్రయాణానికి పెద్దలకు రూ.3000 

చిన్నారులకు రూ.2,400...  

రాష్ట్ర పర్యాటక శాఖ వెల్లడి 

కొల్లాపూర్‌: సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీ లాంచీలో ప్రయాణానికి చిన్నపిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా టికెట్ల ధరలను నిర్ణయించారు. 

వన్‌వే ప్రయాణానికి పెద్దలకు రూ.2,000, చిన్నపిల్లలకు రూ.1,600, వెళ్లి రావడానికి (అప్‌ అండ్‌ డౌన్‌) ప్రయాణానికి పెద్దలకు రూ.3,000, చిన్నపిల్లలకు రూ.2,400గా టికెట్‌ ధరలు నిర్ణయించారు. ప్రయాణికులకు భోజన వసతులు కల్పించనున్నారు. 

ఈ నెల 26 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని లాంచీ మేనేజర్‌ శివకృష్ణ తెలిపారు. లాంచీ ప్రయాణ వివరాలు, టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు మొబైల్‌ నంబర్‌ 7731854994కు సంప్రదించవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement