Maha Shivratri 2023: సైకత శివయ్య | 19. 5 Feet Saikata Maha Linga Unveiled In Sangareddy | Sakshi
Sakshi News home page

Maha Shivratri 2023: సైకత శివయ్య

Feb 16 2023 4:03 AM | Updated on Feb 16 2023 7:52 AM

19. 5 Feet Saikata Maha Linga Unveiled In Sangareddy - Sakshi

సంగారెడ్డి టౌన్‌: మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డిలోని ఫసల్‌వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 19.5 అడుగుల సైకత మహా లింగాన్ని బుధవారం రాత్రి ఆవిష్కరించారు.

విద్యాపీఠం వ్యవస్థాపకుడు డాక్టర్‌ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, గానుగాపూర్‌ పీఠాధిపతి వల్లభానంద సరస్వతి, కూడలి శృంగేరి శంకరాచార్య పీఠాధిపతి అభినవ విద్యారణ్య భారతి స్వామి ముఖ్య అతిథులుగా సైకత శివలింగాన్ని ఆవిష్కరించారు. 360 టన్నుల ఇసుకతో ప్రపంచంలోనే అతి పెద్దదైన సైకత శివలింగాన్ని రూపొందించినట్టు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement